Share News

ఒకే గది.. 273 మంది విద్యార్థినులు

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:37 PM

కోటబొమ్మాళి కస్తూర్బాగాంధీ పాఠశా లలో(కేజీబీవీ) 273మంది విద్యార్థినులకు ఒకేగదిలో భోజనాలు నిర్వహిస్తున్నారు.

ఒకే గది.. 273 మంది విద్యార్థినులు
ఇరుకు గదిలో భోజనం చేస్తున్న విద్యార్థినులు:

కోటబొమ్మాళి, ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళి కస్తూర్బాగాంధీ పాఠశా లలో(కేజీబీవీ) 273మంది విద్యార్థినులకు ఒకేగదిలో భోజనాలు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థినులకు ఒకే గదిలో భోజనం కోసం సరిపోవడంలేదు. ఈనేపథ్యం లో కొందరు కూర్చొని, మరికొందరు నిలబడి భోజనం చేయాల్సివస్తోంది. ఈ మేరకుపాఠశాలలో మంగళవారం పరిశీలనకు వచ్చిన మండల పరిషత్‌ పరిపాల న అఽధికారి నారాయణరావుకు విద్యార్థినులు తమ సమస్యను వివరించారు. విద్యా ర్థినులు పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరానికి కృషిచేస్తానని హామీఇచ్చారు. తొలుత నారాయణరావు విద్యార్థినుల భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం కోడిగుడ్డు పెట్టడంతో కొంతమంది విద్యార్థినులు తినడంలేదని పేర్కొని ఆయన కోడిగుడ్డు తినని వారికి ప్రత్యామ్నా యంగా వేరే కూర వండిపెట్టాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు.

Updated Date - Feb 10 , 2026 | 11:37 PM