Share News

‘ఒకరి రక్తదానం.. ముగ్గురికి ప్రాణదానం’

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:01 AM

ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానంతో సమానమని ఏపీఎ న్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హను మంతు సాయిరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్‌, ఏపీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌ చౌదరి పురుషోత్తం నాయుడు అన్నారు. స్థానిక ఎన్జీవో హోమ్‌ లో ఆదివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.

‘ఒకరి రక్తదానం.. ముగ్గురికి ప్రాణదానం’
రక్తదానం చేస్తున్న ఉద్యోగులు, యువత

అరసవల్లి, జూలై 19(ఆంధ్రజ్యోతి): ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానంతో సమానమని ఏపీఎ న్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హను మంతు సాయిరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్‌, ఏపీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌ చౌదరి పురుషోత్తం నాయుడు అన్నారు. స్థానిక ఎన్జీవో హోమ్‌ లో ఆదివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)లో రక్తం కొరత తీవ్రంగా ఉందని, అందువల్ల యువకులు రక్త దానం చేయాలని కోరారు. ఈ సందర్భంగా 130 మంది యువత, ఉద్యో గులు రక్తదానం చేశారు. రక్తదాతలకు సర్టిఫి కెట్లు అందించి అభినం దించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు అధినేత సూర శ్రీని వాసరావు, ఎన్జీవో సంఘ నేతలు బడగల పూర్ణ చంద్రరావు, ఎంఆర్‌కే దాస్‌, నాళ్ల ఆదినారాయణ, ఉపాద్యాయ సంఘ నాయకుడు భాస్కరరావు, చౌదరి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

రక్తదానంతో తలసేమియా బాధితులకు అండ

అరసవల్లి, జూలై 19(ఆంధ్రజ్యోతి): తలసేమియా బాధితులను ఆదుకునేందుకు రక్తదానం చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి జి.సూర్యప్రకాష్‌ అన్నారు. స్థానిక రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రాంగణంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉందని, జిల్లాలోని మూడు డివి జన్లలో డీలర్లు, సిబ్బంది సహ కారంతో రక్తదాన శిబి రాలు నిర్వహిస్తా మన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ పి.జగన్మో హనరావు, డీలర్ల సంఘం జిల్లా యూనియన్‌ అధ్యక్షుడు బి.భాస్కరరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.రవి కుమార్‌, ఉపాధ్యక్షుడు చిన్ని నాయుడు, ఎస్‌సీఆర్‌ నాయుడు, పి.చైతన్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 12:01 AM