Share News

పేకాట కేసులో ఒకరికి రిమాండ్‌

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:17 AM

హిరమం డలం మండలం సుభలయ కాలనీకి చెందిన కలింగపట్నం రవికి పేకాట కేసులో న్యాయాధికారి నాలుగు రోజులు రిమాండ్‌ విధించినట్టు కొత్తూరు ఎస్‌ఐ వెంటేష్‌ తెలిపారు.

పేకాట కేసులో ఒకరికి రిమాండ్‌

మెళియాపుట్టి(కొత్తూరు)/ హిరమండలం, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): హిరమం డలం మండలం సుభలయ కాలనీకి చెందిన కలింగపట్నం రవికి పేకాట కేసులో న్యాయాధికారి నాలుగు రోజులు రిమాండ్‌ విధించినట్టు కొత్తూరు ఎస్‌ఐ వెంటేష్‌ తెలిపారు. ఈనెల 22న కొత్తూరు మండలం వీరనారయణపురం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.19,420 నగదు, నాలుగు మొబైల్‌ ఫోన్లు, ద్విచక్రవానం స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన వారిలో రవిపై విశాఖ, హిరమండలం, కొత్తూరు పోలీసు స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదు కావడంతో కొత్తూరు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కంది రాణి రిమాండ్‌ విధించినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 25 , 2026 | 12:17 AM