Share News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:16 AM

సీతంపేట కూడలి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిద్దాం గ్రామానికి చెందిన చౌదరి సూరపునాయుడు ఉరఫ్‌ తాత (45) అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

  • మరొకరికి తీవ్ర గాయాలు

జి.సిగడాం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): సీతంపేట కూడలి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిద్దాం గ్రామానికి చెందిన చౌదరి సూరపునాయుడు ఉరఫ్‌ తాత (45) అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన పొదిలాపు ఆదినారాయణ కాలుకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇద్దరూ బైక్‌పై రాజాం నుంచి నిద్దాం వెళు తుండగా వ్యాన్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో సూరపునా యుడు మృతి చెందగా, ఆదినారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని రాజాం సామాజిక ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగా త్రుడిని చికిత్స నిమిత్తం రాజాం ఆసుపత్రికి తరలించారు. సూరపునాయుడికి భార్య గౌరమ్మ, ముగ్గురు కూమార్తెలు ఉన్నారు. కాగా కుటుంబ పెద్ద అకాలంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. గ్రామంలో యాత్ర జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ రమణారావు తెలిపారు.

కల్వర్టును ఢీకొని ఒకరు..

కంచిలి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): నారాయణబట్టి గ్రామ సమీపంలో ఉన్న కల్వర్టును ఢీకొని ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముండల గ్రామానికి చెందిన దుర్యోధన ప్రధాన్‌(35) విదేశాల్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆరు నెలల కిందట స్వగ్రామానికి వచ్చిన దుర్యోధన.. మంగళవారం రాత్రి కంచిలి నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామం వస్తుండగా అదుపుతపిప నారాయణబట్టి సమీపంలో ఉన్న కల్వర్టును ఢీకొని కాలువులో పడిపోయాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలు కావడంతో దుర్యోధన అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా దుర్యోధనకు భార్య భువనేశ్వరి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భువనేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పారినాయుడు తెలిపారు.

ఈదుపురం పాఠశాల హెచ్‌ఎం..

ఇచ్ఛాపురం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఈదుపురం ప్ర భుత్వ ప్రాథమిక పాఠశాల (ఎల్‌ఎఫ్‌ఎల్‌) హెచ్‌ఎం మా ర్కండేయ బిసాయి(59) అస్వస్థతకు గురై బుధవారం మృతి చెందారు. కవిటి మండలం కుసుంపురం గ్రామానికి చెందిన బిసాయి ఈదుపురంలో ఐదేళ్లుగా విధులు నిర్వహి స్తున్నారు. కొన్నాళ్లగా ఈయన కిడ్నీ సమస్యలతో బాధప డుతూ డయాలసిస్‌ చేయించుకుంటూ విధులకు హాజర వుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. హెచ్‌ఎం బిసాయి మృతిపై ఎంఈవోలు కె.అప్పారావు, ఎస్‌.విశ్వనాథం, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సంతాపం వ్యక్తంచేశారు.

Updated Date - Jan 29 , 2026 | 12:16 AM