Share News

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Aug 11 , 2026 | 11:37 PM

చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి (సీనియర్‌ డివిజన్‌), జిల్లా కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.

చట్టాలపై  అవగాహన పెంచుకోవాలి
కోటబొమ్మాళి: మాట్లాడుతున్న సివిల్‌ న్యాయాధికారి హరిబాబు

- సివిల్‌ న్యాయాధికారి హరిబాబు

కోటబొమ్మాళి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి (సీనియర్‌ డివిజన్‌), జిల్లా కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. మంచాలపేట గ్రామంలో పేదరిక నిర్మూలనపై మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులకు సోషల్‌ మీడియా, విద్యా హక్కు, ఉచిత న్యాయ సహాయం కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌, చైల్డ్‌ మ్యారేజ్‌ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సీహెచ్‌. ప్రసాదరావు, కోటబొమ్మాళి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లఖినేని శ్రీనివాస్‌, ఎంపీడీవో కె. నారాయణరావు, ఎస్‌ఐ వి.సత్యనారాయణ, పంచా యతీ ఈవో బోరక నరేష్‌, సీనియర్‌ న్యాయవాది పంచిరెడ్డి అర్జునరావు పాల్గొన్నారు.

ఎక్కువ కేసులు రాజీ చేయాలి: న్యాయాధికారి మాధురి

పలాస, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి):లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పలాస మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధికారి యు.మాధురి కోరారు. మంగళవారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, సబ్‌డివిజన్‌కు చెందిన పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. న్యాయాధికారి మాట్లాడుతూ సెప్టెంబరు 12న జరగనున్న లోక్‌అదాలత్‌లో రాజీ పడే క్రిమినల్‌ కేసులు తక్షణం గుర్తించి ఎక్కువ రాజీ జరిగే విధంగా చర్యలు తీసుకో వాలని అన్నారు. సమావేశంలో సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐలు దుర్గాప్రసాద్‌, నిహాల్‌, ఎక్సైజ్‌ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2026 | 11:37 PM