Share News

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:23 AM

దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.అనిత పిలుపునిచ్చారు. బుధవారం శీకాకుళంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ఏడురోడ్ల జంక్షన్‌ వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏడురోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించి, డెంగ్యూ నివారణా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా మలే రియా అధికారి పీవీ సత్యనారాయణ, డీఐవో పాల్గొన్నారు.

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
అరసవల్లి: డెంగ్యూ వ్యతిరేక ర్యాలీలో ప్రతిజ్ఞచేస్తున్న సిబ్బంది

అరసవల్లి, జూలై 1(ఆంధ్రజ్యోతి): దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.అనిత పిలుపునిచ్చారు. బుధవారం శీకాకుళంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ఏడురోడ్ల జంక్షన్‌ వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏడురోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించి, డెంగ్యూ నివారణా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా మలే రియా అధికారి పీవీ సత్యనారాయణ, డీఐవో పాల్గొన్నారు.

ఫసోంపేట, జూలై 1 (ఆంధ్రజ్యోతి): కొర్లాంలో పీహెచ్‌సీ సిబ్బంది డెంగ్యూవ్యతిరేక మాసోత్సవాలను నిర్వహించారు. ఈసందర్భంగా ర్యాలీ నిర్వహించి వ్యాధిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్గర్‌ ఎన్‌.రోషిణి, సిబ్బంది డి.వాసంతకుమారి, సుజాత పాల్గొన్నారు.

ఫ సోంపేట రూరల్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా కొర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వ ర్యంలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రోషిణి పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 12:23 AM