Share News

ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలి

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:22 AM

పోలీసు విధుల్లో ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.

ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలి
మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పోలీసు విధుల్లో ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. తండేంవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లతో మాట్లాడుతూ.. క్రమశిక్షణ, శారీరక దృఢత్వంతో పాటు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. నేర న్యాయ చట్టాలైన బీఎన్‌ఎస్‌, బీఎన్‌ఎస్‌ఎస్‌పై పూర్తి అవగాహన పెంచు కోవాలన్నారు. శిక్షణలోనే కంప్యూటర్లు, డ్రోన్‌ టెక్నాలజీ, ఇతర ఆధునిక సాంకేతిక, సైబర్‌ నేరాల నియంత్రణ, దర్యాప్తు విధానాలపై నైపుణ్యం పెంపొందిం చుకోవాలన్నారు. అనంతరం ఇండోర్‌ తరగతిలో అభ్యర్థులకు బోధిస్తున్న సీసీటీఎన్‌ఎస్‌, పోలీసింగ్‌, సాంకేతిక నైపుణ్యాల శిక్షణ, వస తులు, వసతి, ఆహారం, నీటి సదుపాయాలను పరిశీలించారు. ఏఎస్పీ శ్రీనివాసరావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ రాజు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 12:22 AM