సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:21 AM
టెలికాం సేవలను వినియోగించే ప్రతిఒక్కరూ తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉం డడంతోపాటు సైబర్ మోసాలపై అప్రమత్తం గా ఉండాలని ట్రాయ్ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ సి.రమణ తెలిపారు.
టెక్కలి, జూలై 30(ఆంధ్రజ్యోతి): టెలికాం సేవలను వినియోగించే ప్రతిఒక్కరూ తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉం డడంతోపాటు సైబర్ మోసాలపై అప్రమత్తం గా ఉండాలని ట్రాయ్ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ సి.రమణ తెలిపారు. గురువారం కె.కొత్తూరు దరి ఐతం కళాశాలలో టెలికాం సేవలపై అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టెలికాం, ప్రసారరంగాల్లో వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు ట్రాయ్ చేప డుతున్న చర్యలను వివరించారు. అనంతరం ట్రాయ్ జాయింట్ డైరెక్టర్ జి.సురేష్‌రెడ్డి టెలికాం వినియోగదారులహక్కులు, టారిఫ్‌లు, బిల్లింగ్ సమస్య లు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్‌కు చెందిన డి.తేజస్విని, కళాశాల డైరెక్టర్ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ ఏఎస్ శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఎస్.మారుతీప్రసాద్ పాల్గొన్నారు.