Share News

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:04 PM

పైడి భీమవరం పంచాయతీ పరిధిలోని రెడ్డీస్‌ పరిశ్రమ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

 రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రమణ (ఫైల్‌)

రణస్థలం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): పైడి భీమవరం పంచాయతీ పరిధిలోని రెడ్డీస్‌ పరిశ్రమ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. జేఆర్‌పురం ఎస్‌ఐ వి.సత్యనారా యణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పాలవలస నుంచి పైడిభీమవరానికి రమణ, పి.రాంబాబు ద్విచక్రవాహనంపై వస్తుండగా రెడ్డీస్‌ పరిశ్రమ ఎదురుగా ఆగి ఉన్న ట్యాంకర్‌ను వెనుక నుంచి బలంగా ఢీ కొన్నారు. ఈ ఘటనలో వెంకటరాపుపేట గ్రామానికి చెందిన రమణ (28) అక్కడిక్కడే మృతి చెందగా పతివాడపాలేనికి చెందిన పి.రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం శ్రీకాకుళంలో ఆసుపత్రికి తరలించారు. రమణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్‌పురం ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 04 , 2026 | 11:04 PM