Share News

టీడీపీలో చేరిన వంద వైసీపీ కుటుంబాలు

ABN , Publish Date - Jan 05 , 2026 | 12:06 AM

కవిటి మండలం నెలవంక పంచాయతీకి చెందిన 100 వైసీపీ కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. సర్పంచ్‌ డి.గౌతమి, మాజీ సర్పంచ్‌ కృష్ణబిసాయి లతో పాటు వంద కుటుంబాలు టీడీపీలో చేరగా వారికి ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.

టీడీపీలో చేరిన వంద వైసీపీ కుటుంబాలు
పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే అశోక్‌

కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే అశోక్‌

కవిటి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): కవిటి మండలం నెలవంక పంచాయతీకి చెందిన 100 వైసీపీ కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. సర్పంచ్‌ డి.గౌతమి, మాజీ సర్పంచ్‌ కృష్ణబిసాయి లతో పాటు వంద కుటుంబాలు టీడీపీలో చేరగా వారికి ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, కూటమి ప్రభుత్వంలో పంచాయతీని మరింత అభివృద్ధి చేయా లన్న ఉద్దేశంతో తామంతా టీడీపీలో చేరామన్నారు. ఎమ్మెల్యే అశోక్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో గ్రామా ల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు. 18 నెలల కాలంలో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలో పేతానికి కృషి చేయాలన్నారు. కార్యక్ర మంలో ఏఎంసీ చైర్మన్‌ మణిచంద్రప్రకాష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాసుదేవ్‌ ప్రదాన్‌, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌వీరమణ, పార్టీ మం డల అధ్యక్షుడు పి.కృష్ణారావు, నేతలు బి.రమేష్‌, ఎ.లీలారాణి, డి.కామేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2026 | 12:06 AM