కొబ్బరికాయల విక్రయానికి వెళ్తుండగా...
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:32 PM
మం డలంలోని బూరగాంసమీపంలో జాతీయరహదారిపై ఆది వారం కారు ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న హరిశ్చంద్ర పండి(64) మృతిచెందాడు.
పాతపట్నం/రూరల్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని బూరగాంసమీపంలో జాతీయరహదారిపై ఆది వారం కారు ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న హరిశ్చంద్ర పండి(64) మృతిచెందాడు. స్థానికులు, పోలీ సుల కథనం మేరకు.. మండలంలోని కాగువాడకు చెందిన హరిశ్చంద్ర పండి ఇక్కడ సంతోషిమాత ఆలయప్రధాన ద్వారంసమీపంలో జాతీయరహదారి పక్కన కొబ్బరికాయలు విక్రయించి జీవిస్తున్నాడు. రఽథసప్తమి పురస్కరించుకొని ఆలయంవద్ద భక్తులకు కొబ్బ రికాయలు విక్రయించేందుకు పాతపట్నంలో కొనుగోలు చేసి బయలుదేరాడు. ఆ సమయంలో పర్లాకిమిడికి చెందిన కొందరు కారులో అరసవల్లి సూర్య నారాయణమూర్తి ఆలయానికి వెళ్లి తిరిగివస్తున్నారు. బూరగాం ఎస్సీకాలనీ కూడలివద్ద జాతీయరహదారిపై ముందువెళ్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న హరిశ్చంద్ర పండి రోడ్డుపై పడి పోవడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులకు సమాచారం తెలియ డంతో ఏఎస్‌ఐ కె.శ్రీరామ్మూర్తి ఘటనాస్థలానికి చేరుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మృతదేహాన్ని పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. హరిశ్చం ద్ర పండికి భార్య సరస్వతి పండి, కుమార్తె స్వప్న పొల్లాయ్, కుమారుడు శిబొ పండి ఉన్నారు. భార్య సరస్వతి పండి ఫిర్యాదుమేరకు ఏఎస్‌ఐ కె.శ్రీరా మ్మూర్తి కేసునమోదుచేశారు.