Share News

భర్త చెప్పాడని ఇంటికి వెళ్తుండగా..

ABN , Publish Date - May 28 , 2026 | 01:02 AM

మండలంలోని జాడ గ్రామానికి చెందిన కోరాడ కళావతి (42)అనే మహిళ పిడుగుపాటుకు గురై మృతి చెందింది.

భర్త చెప్పాడని ఇంటికి వెళ్తుండగా..
కళావతి (ఫైల్‌)

- పిడుగుపాటుకు మహిళ మృతి

- గొర్రెల మంద నుంచి వస్తుండగా ఘటన

జి.సిగడాం, మే 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జాడ గ్రామానికి చెందిన కోరాడ కళావతి (42)అనే మహిళ పిడుగుపాటుకు గురై మృతి చెందింది. మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలో భర్త పెంటయ్యతో కలిసి కళావతి గొర్రెల మందను కాసేందుకు వెళ్లింది. కొంతసేపటికి ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో భార్య కళావతిని ఇంటికి వెళ్లిపోవాలని భర్త చెప్పాడు. దీంతో భర్త మాట మీద ఇంటికి వెళ్తుండగా గ్రామ సమీపంలో పిడుగుపడి స్పృహ కోల్పోయింది. వెనుక నుంచి వస్తున్న కొందరు గ్రామస్థులు గమనించి కు టుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ఆటోలో రాజాం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే కళావతి మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో బోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి రాజు, భాస్కరరావు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - May 28 , 2026 | 01:02 AM