సముద్ర తీరంలో.. కాలువల పక్కన
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:24 AM
మండలంలోని బారువ కొత్తూరు, ఎకు వూరు, గొల్లగండి తదితర గ్రామాల్లో శ్మశానవాటికల స్థలాలు కబ్జాకు గురయ్యాయి.
సోంపేట రూరల్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బారువ కొత్తూరు, ఎకు వూరు, గొల్లగండి తదితర గ్రామాల్లో శ్మశానవాటికల స్థలాలు కబ్జాకు గురయ్యాయి. దీంతో గ్రామాల్లో గట్లుపై, కాలువల పక్కన, సముద్రతీరంలో అంత్యక్రియలు నిర్వ హించాల్సి వస్తోంది. పూర్వీకుల నుంచి వినియోగిస్తున్న శ్మశానాలను కొందరు కబ్జా చేసి పంటపొలాలుగా మార్చేయడంతో దహన సంస్కారాలకు సమస్యగా మారింది. తాతముత్తాతల నుంచి వాడుతున్న శ్మశానాలను కొందరు ఆక్రమించి వ్యవసాయ భూములుగా మార్చేయడంతో సముద్ర తీరాల్లోని మృతదేహాలను ఖననం చేస్తు న్నారు. పాలవలసలో గ్రామ సమీపంలో శ్మశానం లేకపోవడంతో రెండు కిలోమీటర్ల దరంలో ఉన్న మహేంద్రతనయ నది వద్దకు మోసుకెళ్లాల్సివస్తోంది. తీరంలో ఎటు వంటి షెల్టర్లు లేకపోవడంతో వర్షం కురిస్తే అంత్యక్రియల నిర్వహణకు అగచాట్లు తప్పడం లేదని పలువురు వాపోతున్నారు.
పొలాల గట్లపై ..
బేసి రామచంద్రాపురంతోపాటు పలు గ్రామాల్లో శ్మశానానికి దారి లేకపోవడంతో పొలాల గట్లు వెంబడి కాలువల పక్కన దహనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. రెవె న్యూ రికార్డుల్లో శ్మశానం భూమి ఉన్నా, హద్దురాళ్లు లేకపోవడంతో ఆక్రమణలకు గుర వుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయాన్ని పలుసార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండాపోయిందని వారంతా ఆవేదన వ్యక్తంచేశారు. శ్మశాన భూములను గుర్తించి వెంటనే హద్దులు, ఆ క్రమణలను తొల గించి ప్రహరీలు ఏర్పాటు చేయాలని, నీటి సౌకర్యం, షెడ్ నిర్మించాలని పలువురు కోరుతున్నారు.