Share News

పరామర్శకు వెళుతూ.. ప్రమాదానికి గురై..

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:31 AM

తమ బంధు వును పరామర్శించేందుకు వెళ్లిన భార్యాభర్తలు ప్ర మాదానికి గురయ్యారు. ఈ ఘటనలో భార్య మృ తి చెందగా, భర్తకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..

పరామర్శకు వెళుతూ.. ప్రమాదానికి గురై..

  • భార్య మృతి

  • భర్తకు గాయాలు

ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): తమ బంధు వును పరామర్శించేందుకు వెళ్లిన భార్యాభర్తలు ప్ర మాదానికి గురయ్యారు. ఈ ఘటనలో భార్య మృ తి చెందగా, భర్తకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆమదాలవలస మండలం లక్ష్ముడుపేటకి చెందిన పూజారి కామే శ్వరరావు, వనజాక్షి దంపతులు. వీరు కొన్నేళ్లుగా ఎచ్చెర్ల మండలం కేశవరావుపేటలో నివాసం ఉంటున్నారు. వీరి బంధువు ఒకరు కేశవరావుపేట పంచాయతీ నాగావళి సాల్వెంట్‌ ఆయిల్‌ పరిశ్రమ ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో గాయపడ్డాడు. ఈ విషయం తెలిసిన కామేశ్వరరావు, వనజాక్షి ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో తమ బంధువును పరా మర్శించేందుకు బైక్‌పై రాంగ్‌ రూట్‌లో వెళ్తుండగా విశాఖపట్నం వైపు వస్తున్న వ్యాన్‌ బలంగా ఢీ కొంది. ఈ ఘటనలో వనజాక్షి తలకు తీవ్ర గా యంకావడంతో 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం లోని సర్వజనాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రవీకరించారు. కామేశ్వరరావు కాలికి గాయమైంది.

ఒకే ప్రాంతంలో మూడు ప్రమాదాలు

అంతకు గంటకు మునుపు ఓ ప్రమాదం కూడా ఇదే స్థలంలో జరిగింది. దాదాపుగా ఒకే సమయం లో వరుసగా మూడు ప్రమాదాలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కామేశ్వరరావు విద్యుత్‌ శాఖలో బిల్లు కలెక్టర్‌గా పనిచేస్తుండగా, ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేస దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 06 , 2026 | 12:31 AM