Share News

నూనె గింజలు సాగు చేయాలి

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:19 PM

: రబీలో నూనె గింజలను సాగుచేయడం లాభసాటిగా ఉంటుందని నరసన్నపేట వ్యవసాయసబ్‌డివిజన్‌ ఏడీఏ వెంకట మధు, శాస్త్రవేత్త జ్యోతిబసు తెలిపారు.

 నూనె గింజలు సాగు చేయాలి
రైతులకు అవగాహన కల్పిస్తున్న జ్యోతిబసు

నరసన్నపేట, ఫిబ్రవరి 3(ఆంఽధ్రజ్యోతి): రబీలో నూనె గింజలను సాగుచేయడం లాభసాటిగా ఉంటుందని నరసన్నపేట వ్యవసాయసబ్‌డివిజన్‌ ఏడీఏ వెంకట మధు, శాస్త్రవేత్త జ్యోతిబసు తెలిపారు. మంగళవారం దూకలపాడులో నూనెగింజలు జాతీయమిషన్‌లో భాగంగా రైతులకు నువ్వుపంట సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎరువులు, పురుగు, తెగుళ్ల యాజమాన్యం, అఽధికంగా యూరియా వాడడం వల్ల కలిగే అనర్థాలు, పంట అవశేషాలు కాల్చడం వల్ల నష్టాలపే వివరించారు. కార్యక్రమంలో జిల్లా పరిశోధన కేంద్ర అధికారి సురేష్‌, ఏవో సూర్యకుమారి, సర్పంచ్‌ అసిరినాయుడు పాల్గొన్నారు.

నూనెల గింజల సాగుతో అధిక ఆదాయం

కొత్తూరు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో నూనె గింజలతో రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చని వ్యవసాయశాఖ సహాయ సంచా లయడు బి.రాజగోపాలరావు సూచించారు. అధికారులు సలహాలు పాటించి అధిక దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. మంగళవారం గొట్టిపల్లిలో రైతులకు నూనెగింజ విత్తనాలను అందజేశారు. కార్యక్రరమంలో కొత్తూరు పీఏసీఎస్‌ అధ్యక్షుడు మాతల గాంఽధీ, అగతముడి అరుణకుమార్‌, ఏవో సుమంత్‌, వెలుగు సంస్థ ప్రతినిధి సవర ఆనందరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:19 PM