Share News

అయ్యో.. మీనాకు ఏమైంది?

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:02 AM

పలాస సీహెచ్‌సీ లో ఓ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ గంటల వ్యవధిలో చనిపోయింది. మెలకువ వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడి కన్నుమూసింది.

అయ్యో.. మీనాకు ఏమైంది?
మీనా (ఫైల్‌)

  • చికిత్స పొందుతూ బాలింత మృతి

  • క్షేమంగా ఒక్కరోజు వయస్సున్న బిడ్డ

పలాస, మార్చి 21(ఆంధ్రజ్యోతి): పలాస సీహెచ్‌సీ లో ఓ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ గంటల వ్యవధిలో చనిపోయింది. మెలకువ వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడి కన్నుమూసింది. పలాస మండలం దానగొర గ్రామానికి చెందిన మీనాకు హిమగిరి గ్రామానికి చెందిన సవర ప్రేమ్‌కుమార్‌తో వివాహం జరిగింది. ప్రేమ్‌కుమార్‌ మొగిలిపాడు రోడ్డులోని ఓ వైన్‌షాపులో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇదివరకే ఒక ఆడ బిడ్డ ఉంది. రెండో కాన్పు కావడంతో శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి(సీహెచ్‌సీ)లో డెలివరీకి చేర్పించా రు. ఉదయం 9 గంటలకు ఆమె ఆడబిడ్డకు శస్త్రచికిత్స ద్వారా జన్మనిచ్చింది. కుటుంబ నియంత్రణ చికిత్స కూ డా కుటుంబ సభ్యులు చేయించేశారు. మత్తులో ఉన్న మీనా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మెలకువ లోకి వచ్చింది. తనకు బాగే ఉందని, భర్త, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సంతోషంగానే ఉంది. బిడ్డ గురించి ఆరా తీసింది. అందరూ ఆనందంగా ఉన్నారు. నిమిషాల్లోనే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని వైద్యులకు చెప్పడంతో వివిధ పరీక్షలు చేయించి చికిత్స అందించినా చివరికి రక్షించలేకపో యారు. నిమిషాల వ్యవధిలోనే ఆమె చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు భోరుమన్నారు. ఈ విషయం పై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ టి.పాపినాయుడు మాట్లాడుతూ.. శస్త్రచికిత్స అంతా విజయవంతంగా జరి గిందని, కార్బోఎంబోలిజం (రక్తం గడ్డకట్టి ఊపిరితిత్తు ల్లోకి వెళ్లిపోవడం) కారణంగా మృతి చెందినట్టు చెప్పారు. ప్రసవ సమయంలో ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని, మీనాను బతికించేందుకు ఎంతో శ్రమించినా ఫలితం లేకపోయిందన్నారు. విష యం తెలుసుకున్న గిరిజన సంఘాల నాయకులు సవ ర జగన్నాయకులు, సవర రాంబాబుతో పాటు సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. మీనా మృతిపై వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 12:02 AM