అయ్యో గోమాత!
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:32 AM
అధికారులు, పోలీ సులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పశువుల అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు.
మృతి చెందిన ఆవును సాగునీటి కాలువలో పడేశారు..
అక్రమ రవాణాదారుల పనేనంటున్న ప్రజలు
కోటబొమ్మాళి, మార్చి 8(ఆంధ్రజ్యోతి): అధికారులు, పోలీ సులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పశువుల అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. వారి కళ్లుకప్పి అక్ర మ రవాణాదారులు యథేచ్ఛగా పశువులను తరలిస్తున్నారు. శనివారం రాత్రి పలాస వైపు నుంచి శ్రీకాకుళం వైపు ఆవు లను అక్రమంగా తరలిస్తున్న లారీలో ఒక ఆవు మృతి చెం దింది. ఎవరైనా లారీ పట్టుకుంటే కేసు అవు తుందన్న భయంతో అక్రమ రవాణాదారులు హరిశ్చంద్రపురం జంక్షన్ వద్ద జాతీయ రహ దారికి ఆనుకొని ఉన్న సాగునీటి కాలువలో చనిపోయిన ఆవును పడేసినట్లు స్థా నికులు చెబుతున్నారు. నీటిలో తేలిన ఆవు కళేబరాన్ని ఆదివారం ఉదయం స్థానికులు చూసి ‘అయ్యో గోమాత... నీకు ఎం తకష్టం వచ్చిందని’ వాపోయారు. ఇప్పటికైనా పోలీసులు, అధికారులు స్పందించి పశువుల అక్రమ రవాణాదారులపై కేసులు నమోదు చేసి శిక్షించాలని కోరుతున్నారు.