Share News

అయ్యో బిడ్డా..

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:20 AM

కుమారుడి చితికి తల్లి నిప్పంటించిన ఘటన ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామంలో చోటు చేసుకుంది.

అయ్యో బిడ్డా..
కుమారుడికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న తల్లి దేవి

- కుమారుడి చితికి నిప్పంటించిన తల్లి

- బూర్జపాడులో విషాదం

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): కుమారుడి చితికి తల్లి నిప్పంటించిన ఘటన ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామంలో చోటు చేసుకుంది. బూర్జపాడుకు చెందిన బంగ యోగి(15) అనే యువకుడు గత కొద్ది నెలలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. బుధవారం ఇంట్లో ఉండగానే హఠాత్తుగా హైబీపీ రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. యోగి తండ్రి సింహాచలం విదేశాల్లో (వలస కూలి) ఉన్నాడు. తల్లి దేవి గృహిణి. అక్క ఇంటర్‌ చదువుతుంది. తండ్రి అందుబాటులో లేకపోవడంతో తల్లి దేవి తన కుమారుడి చితికి నిప్పటించింది. చేతికందివచ్చిన కొడుకు మృతి చెందడంతో అయ్యో బిడ్డా మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా అంటూ కన్నీరు మున్నీరయ్యింది. ఆమెకు చూసి గ్రామస్థులంతా కన్నీరు పెట్టుకున్నారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. కన్నకొడుకు చితికి నిప్పంటించే దుస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని, ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యోగి అంతియ యాత్రలో యువకులు, కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 12:20 AM