Share News

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:20 AM

అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ కోరారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి
మాట్లాడుతున్న కూన రవికుమార్‌

ఆమదాలవలస, జూలై 1 (ఆంధ్రజ్యోతి): అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ కోరారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో విద్యుత్‌, గృహ నిర్మాణశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ గృహ నిర్మాణ పథకాల పురోగతి, గృహాల నిర్మాణాల్లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యకు వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు.

పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు శ్రావ్య స్ఫూర్తి

పొందూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఈఏపీ సెట్‌లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన కోరుకొండ శ్రావ్య భవిష్యత్‌లో జేఈఈ, నీట్‌, పరీక్షలకు హాజరయ్యే వారికి స్ఫూర్తిగా నిలుస్తుందని పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ తెలిపారు. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సా ధించిన శ్రావ్యను రవికుమార్‌ పొందూరులోని విద్యార్థిని ఇంటిలో బుధవారం అభినందించారు. ఆయన వెంట టీడీపీ మండలాధ్యక్షులు సీహెచ్‌ రామ్మోహన్‌, దండా రవికుమార్‌, డిప్యూటీ ఎంపీడీవో డి.అప్పన్న ఉన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 12:20 AM