Share News

ఒడిశా టు ముంబై

ABN , Publish Date - Sep 05 , 2026 | 11:16 PM

ఒడిశా నుంచి ముంబైకి గంజాయిని తరలిస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ మీసాల చిన్నమనాయు డు తెలిపారు.

  ఒడిశా టు ముంబై
వివరాలు వెల్లడిస్తున్న సీఐ చిన్నమనాయుడు

-8 కేజీల గంజాయి రవాణా

-నిందితుడి అరెస్ట్‌

ఇచ్ఛాపురం, సెప్టెంబ రు 5 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి ముంబైకి గంజాయిని తరలిస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ మీసాల చిన్నమనాయు డు తెలిపారు. శనివారం సర్కిల్‌ కార్యాలయంలో ఆ వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా చన్నమేరి పంచాయతీ పట్టపూర్‌ గ్రామానికి చెందిన డాల్‌ బెహరా చిత్రసన్‌ ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో అదే గ్రామంలో గంజాయి వ్యాపారం చేసే సైలు గౌడోతో కలిసి డబ్బులు సాయం చేయమని అడిగాడు. తాను గంజాయిని ముంబై తీసుకొని వెళ్లేటప్పుడు తనకు సాయంగా వచ్చిన ప్రతిసారీ రూ.7 వేలు ఇస్తానని చెప్పాడు. దానికి అంగీకరించిన డాల్‌ బెహరా శనివారం 8 కేజీల గంజాయిని పట్టుకొని గ్రామం నుంచి బయలుదేరి ముంబై వెళ్లేందుకు ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో పట్టణ ఎస్‌ఐ ముకుందరావు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిసించిన డాల్‌ బెహరాను పట్టుకుని తనిఖీ చేపట్టగా అతని వద్ద గంజాయి దొరికింది. గంజాయితో పాటు సెల్‌ఫోన్‌ సీజ్‌ చేసి, సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ ముకుందరావు, హెచ్‌సీ రంజిత్‌ పాల్గొన్నారు

Updated Date - Sep 05 , 2026 | 11:16 PM