Share News

ఒడిశా టు మహారాష్ట్ర

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:05 AM

గంజాయితో ము గ్గురిని అరెస్టు చే సి, వారి నుంచి 7.6 కిలోల గంజా యి స్వాధీనం చే సుకున్నట్టు కాశీ బుగ్గ సీఐ వై.రామ కృష్ణ తెలిపారు.

ఒడిశా టు మహారాష్ట్ర
వివరాలు వెల్లడిస్తున్న కాశీబుగ్గ సీఐ రామకృష్ణ

  • 7.6 కిలోల గంజాయితో ముగ్గురి అరెస్టు

పలాస, మార్చి 31(ఆంధ్రజ్యోతి): గంజాయితో ము గ్గురిని అరెస్టు చే సి, వారి నుంచి 7.6 కిలోల గంజా యి స్వాధీనం చే సుకున్నట్టు కాశీ బుగ్గ సీఐ వై.రామ కృష్ణ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో విలేకరు లతో మాట్లాడారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. పలాస రైల్వేస్టేషన్‌ వద్ద కాశీబుగ్గ ఎస్‌ఐ నర్సింహమూర్తి వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తు లు బ్యాగులతో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. దీంతో వారిని పట్టుకుని బ్యాగులు తనిఖీ చేయగా.. 7.6 కిలోల గంజాయి ప్యాకెట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని పాలఘర్‌ గ్రామానికి చెందిన గౌతమ్‌గోపాల్‌ ఠక్కర్‌, రాముల్‌ రామ్మోహన్‌ మౌర్యతోపాటు అదే రాష్ట్రం వీరేంద్రనగర్‌కు చెందిన రాజేష్‌ అశోక్‌ డూడీకి గంజాయి సరఫరా చేసే ఒడిశా రాష్ట్రం, రాయఘడ జిల్లా, బర్టింగ్‌గూడకు చెందిన జగన్‌సబార్‌, బలిపట్నాకు చెందిన జొయిన్‌రాయికతో పరిచయం అయిం ది. వీరి నుంచి తరచూ గంజాయి కొనుగోలు చేసుకుని మహరాష్ట్రకు తరలిస్తూ విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం కూడా 7.6 కిలోల గంజాయి పర్లాకిమిడి (ఒడిశా)లో కొనుగోలు చేసి.. బస్సులో పలాస రైల్వే స్టేషన్‌కు వస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్‌ విధించినట్టు సీఐ తెలిపారు.

Updated Date - Apr 01 , 2026 | 12:05 AM