Share News

రైలు ఢీకొని ఒడిశా వాసి మృతి

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:22 AM

ప్రహరాజపాలెం గ్రామ సమీపంలో సోమవారం గుణుపూర్‌ నుంచి పూరీ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.

రైలు ఢీకొని ఒడిశా వాసి మృతి

పాతపట్నం/రూరల్‌, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ప్రహరాజపాలెం గ్రామ సమీపంలో సోమవారం గుణుపూర్‌ నుంచి పూరీ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పలాస జీఆర్పీ ఎస్‌ఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా సింగుపురం గ్రామానికి చెంది న భీమ్‌సేన్‌ మిశాల్‌(30)గా గుర్తించారు. మిశాల్‌ కు భార్యతోపాటు ఒక కుమారుడు ఉన్నా డు. మృ తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు న మోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్‌ఐ తెలిపారు.

ఒండ్రుకుడియా గెడ్డలో పడి ఒకరు..

  • ఆలస్యంగా వెలుగులోకి..

వజ్రపుకొత్తూరు, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఒండ్రుకుడియా గ్రామ పరిధి లో గల ఆర్‌అండ్‌బీ రోడ్డు కల్వర్టు ప క్కనే ఉన్న గెడ్డలో తేలి ఉన్న మృతదే హాన్ని సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘ టనా స్థలానికి చేరుకుని పోలీసులు వి చారణ చేపట్టి.. మృతుడిది పలాస మండలం లొత్తూరు పంచాయతీ చి న్నపరియా గ్రామానికి చెందిన సవర భాస్కరరావు(36)గా గుర్తించారు. పో లీసులు తెలిపిన వివరాల మేరకు.. భా స్కరరావు తన భార్య భారతి, ఇద్దరు పిల్లలతో కలిసి కాశీబుగ్గలో గల ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. పిల్లలు చదువుతుండగా భార్యభర్తలు పలాస లోని ఓ జీడి పరిశ్రమంలో కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితే తన చిన్న మా మయ్యకు ఆరోగ్యం బాగులేదని తెలిసి ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై లొత్తూరు వెళ్లాడు. తిరిగి రాత్రి పూట వస్తుండగా ఒండ్రుకుడియా రోడ్డు మలుపు వద్ద ప్రమాదానికి గురై పక్కనే ఉన్న నీటిగుంటలో పడి మృతిచెందాడు. ఇదిలావుంటే భాస్కరరావు తిరిగి ఇంటికి రాకపోవడంతో తమ బంధువులతో కలిసి గత రెండు రోజులుగా భార్య భారతి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఒండ్రు కుడియా వద్ద నీటిలో మృతదేహం ఉన్నట్టు బంధువువల ద్వారా తెలుసుకున్న భారతి వెళ్లి పరిశీలించి.. తన భర్త భాస్కరరావు మృతదేహంగా గుర్తించింది. స్థానికుల సాయంతో నీటి ఉన్న మృతదేహాన్ని, ద్విచక్రవాహనాన్ని బయటకు తీ శారు. రెండురోజులుగా మృతదేహాం నీటిలో ఉండడంతో పూర్తిగా పాడయి పోయింది. ఈ ఘటనపై హెచ్‌సీ వైకుంఠరావు కేసు నమోదు చేసి.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు..

రణస్థలం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): నెలివాడ జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరువాడ గ్రామానికి చెందిన లెంక మోహన్‌ (చందు) (18) మృతి చెందగా.. కొవ్వాడకి చెందిన మైలపల్లి లక్ష్ముడికి తీవ్ర గాయాల య్యాయి. పోలీసులు తెలిపిన వివ రాలిలా ఉన్నాయి.. పైడిభీమవరం నుంచి ద్విచక్ర వాహ నంపై ఇద్దరు రణస్థలం వస్తుండగా నెలివా డ జంక్షన్‌ వద్ద ఒక ప్రైవేటు బస్సుకు వెనుక నుం చి బలంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లెంక మోహన్‌ అక్కడిక్కడే మృతి చెందగా లక్ష్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. మోహన్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 17 , 2026 | 12:22 AM