కూటమి హయాంలో అభివృద్ధిని గమనించండి
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:43 PM
ఢిల్లీలో కూర్చొని ప్రెస్‌మీట్లు ఇవ్వడం కాదని, నియోజకవర్గానికి వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి కూటమి ప్రభుత్వ హయంలో జరగుతున్న అభి వృద్ధిని గమనించాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ హితవుపలికారు.
హిరమండలం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో కూర్చొని ప్రెస్‌మీట్లు ఇవ్వడం కాదని, నియోజకవర్గానికి వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి కూటమి ప్రభుత్వ హయంలో జరగుతున్న అభి వృద్ధిని గమనించాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ హితవుపలికారు. ప్రస్తుతం కూట మి ప్రభుత్వం హయంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వైసీపీ నాయకులకు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. ఆదివారం హిరమండలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ హిరమండ లంలో శనివారం జరిగిన వైసీపీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ, తల్లికివందనం, ఉచిత గ్యాస్, ఇతర పథకాలు కూటమి ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శించారిని, ఎప్పుడూ ఆమె ఢిల్లీలో ఉంటే రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ పథ కాలు అందుతున్నాయోలేదో ఎలా తెలుస్తుందని కలమట ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కె.సింహాచలం, ఎస్.గోవిందరావు, జగన్‌మోహన్‌రావు పాల్గొన్నారు.