ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:39 AM
ఎల్.కోట సీతారాం పురం జంక్సన్ వద్ద నందమూరి తారకరామారావు విగ్రహాన్ని గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
లక్కవరపుకోట జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఎల్.కోట సీతారాం పురం జంక్సన్ వద్ద నందమూరి తారకరామారావు విగ్రహాన్ని గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహం తలభాగంపై రాళ్లతో కొట్టారు. ఎడమచేయిని విరగ్గొట్టారు. సమాచారం అందుకున్న విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరాజు విగ్రహాన్ని పరిశీలించారు. బాధ్యులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ప్రశాంత గ్రామంలో కక్షలు రాజేసేందుకు దుండగులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌తో పరిశీలించినట్లు చెప్పారు. ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.