Share News

ఎమ్మెల్సీ దువ్వాడకు నోటీసులు

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:12 AM

Notices issued to Duvvada గతేడాది డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వైసీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని వాస్‌కు పోలీసులు మూడోసారి నోటీసు లు జారీచేశారు.

ఎమ్మెల్సీ దువ్వాడకు నోటీసులు

హిరమండలం, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): గతేడాది డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వైసీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని వాస్‌కు పోలీసులు మూడోసారి నోటీసు లు జారీచేశారు. పెందుర్తిలో రూ.75కోట్ల విలువైన పేదల బియ్యం పట్టుకున్న సమ యంలో డిప్యూటీ సీఎం పవన్‌పై దువ్వాడ శ్రీనివాస్‌ సామాజిక మాధ్యమాల్లో అను చిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నా యి. దీనిపై హిరమండలంలోని గొట్ట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అప్పట్లో దువ్వాడపై హిరమండలం పోలీసుస్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. కేసు విచారణ నిమిత్తం హిరమండలం స్టేషన్‌కు స్వయంగా హాజ రు కావాలని ఇప్పటికే రెండుసార్లు దువ్వాడకు నోటీసులు పంపారు. కానీ ఆయన రాలేదు. ఈ నెల 22న విచారణకు రావాలంటూ శనివారం మరోసారి దువ్వాడకు నోటీసులు జారీ చేశామని కొత్తూరు సీఐ ప్రసాదరావు తెలిపారు.

Updated Date - Jun 22 , 2026 | 12:12 AM