Share News

వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదు

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:12 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికీ న్యాయం జర గలేదని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నా రు. మంగళవారం స్థానిక అంబే డ్కర్‌ ఆడిటోరియంలో గతంలో టిడ్కో ఇళ్లు రాని బాధితులు వారు చెల్లించిన మొత్తం రూ.10,50,91,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదు
మహిళకు చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

టిడ్కో బాధితులకు రూ.10.50 కోట్ల చెక్కులు అందజేత

శ్రీకాకుళం అర్బన్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికీ న్యాయం జర గలేదని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నా రు. మంగళవారం స్థానిక అంబే డ్కర్‌ ఆడిటోరియంలో గతంలో టిడ్కో ఇళ్లు రాని బాధితులు వారు చెల్లించిన మొత్తం రూ.10,50,91,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు మహిళా పక్షపాతి అని, అందువల్లే వారికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించార న్నారు. అర్హులైన ప్రతి మహిళకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలెండర్లు ఇస్తున్నా రని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి చేయడం లేదని వారి నాయకులకు ప్రజలు ప్రశ్నిస్తే పథకాల కింద డబ్బులు ఇస్తున్నాం కదా అభివృద్ధి ఎలా చేసేది అని మాట్లాడడం అన్యాయమన్నారు. ఇప్పటివరకు రూ.10,50,91,000 టిడ్కో ఇళ్లు రాని వారికి అందిస్తున్నామని, మరోవారం రోజుల్లో మిగిలిన వారికి చెక్కులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ శ్రవణ్‌ కుమార్‌, టీడీపీ నాయకులు పాండ్రంకి శంకర్‌, మాదా రపు వెంకటేష్‌, పీఎంజేబాబు, రెడ్డి గిరిజా శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 12:12 AM