సందడిగా..
ABN , Publish Date - Mar 29 , 2026 | 11:47 PM
జిల్లా వ్యాప్తంగా ఆదివారం టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.
- జిల్లాలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు
- ఎన్టీఆర్‌కు ఘన నివాళి
జిల్లా వ్యాప్తంగా ఆదివారం టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయాల వద్ద టీడీపీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. సీనియర్ నాయకులను సన్మానించారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే రవికుమార్
ఆమదాలవలస, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల ప్రజల సంక్షేమం కోసం ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, అదే ఉద్దేశంతో టీడీపీని ఏర్పాటు చేశారని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆదివారం ఆమదాలవలసలో పార్టీ ఆవిర్భావ దినం నిర్వహించారు. పారిశ్రామికవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ ప్రసాద్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకష్ణంనాయుడు, జిల్లా తెలు గు మహిళా అధ్యక్షురాలు సుజాత, నారాయణపురం ఆనకట్ట చైర్మన్ సనప ల ఢిల్లీశ్వరరావు, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ టి.చంద్రశేఖర్, రాష్ట్ర మెడికల్ బోర్డు సభ్యుడు సుధాకర్, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
బలమైన శక్తిగా టీడీపీ: ఎమ్మెల్యే శిరీష
పలాస/కాశీబుగ్గ, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడు నాయకత్వంలో టీడీపీ బలమైన శక్తిగా ఉందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. టీడీపీ వ్యవస్థాపక దినం సందర్భంగా పలాస టీడీపీ కార్యా లయం, కాశీబుగ్గ పాతబస్టాండ్ వద్ద ఆమె పార్టీ జెండాను ఆవిష్కరిం చారు. అనంతరం సీనియర్ కార్యకర్తలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టిన చరిత్ర ఎన్టీఆర్‌దని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహో న్నత వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గౌతు శ్యామసుందరశివాజి, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావుయాదవ్, గ్రంథాలయసంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాస్, జిల్లా రైస్‌మిల్లర్స్ సంఘం ప్రధాన కార్యదర్శి శాసనపురి మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఆ ఘనతఎన్టీఆర్‌దే: ఎమ్మెల్యే బగ్గు
నరసన్నపేట, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్ యార్డులో టీడీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో టీడీపీ నియోజవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, కురాకుల కార్పొరేషన్ చైర్మన్ దామోదరం నర్సింహలు, కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, కళింగ కోమటి కార్పొరేషన్ డైరెక్టర్ జామి వెంకట్రావు, వంశధార డీసీ చైర్మన్ ఎంవీ నాయుడు, శిమ్మ చంద్రశేఖర్, టీడీపీ మండల అధ్యక్షుడు అడపా చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీనియర్ కార్యకర్తలను సన్మానించారు.
రాజకీయ చైతన్యానికి నాంది: ఎమ్మెల్యే గోవిందరావు
పాతపట్నం మార్చి 29(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఆవిర్భావం దేశ రాజకీయా ల్లో సమూల మార్పులను తీసుకొచ్చిందని, రాష్ట్రంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికిందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నంలో టీడీపీ ఆవిర్భావ దినం నిర్వహించారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వ హించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ నాయకులను సత్కరించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలే మార్గదర్శకం: ఎమ్మెల్యే శంకర్
అరసవల్లి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ ఆశయాలే మార్గదర్శ కాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్ర హానికి పూలమాల వేసి నివాళి అర్పించి పార్టీ ఆవిర్భావదినం నిర్వ హించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ కోసం నిజాయతీగా, కష్టించి పనిచేసిన కార్యకర్తలు, నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదల వలస రమేష్, నగర పార్టీ అధ్యక్షుడు పాండ్రంకి శంకర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పేదవాడికి తిండిపెట్టిన పార్టీ: ఎమ్మెల్యే అశోక్
కవిటి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): పేదవాడికి తిండిపెట్టి వారి జీవితాలను మెరుగుపర్చిన పార్టీ టీడీపీ అని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. కవిటిలో ఆదివారం పార్టీ జెండాను అవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పార్టీని గ్రామస్థాయిలో ముందుకు తీసుకువెళ్లారన్నారు. కార్యక్ర మంలో పార్టీ మండల అధ్యక్షుడు పి.కృష్ణారావు, నేతలు బి.రమేష్, వి.రంగా రావు, దేవికా జెన్నా, బాసుదేవ్ రౌళో, బి.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
44 మీటర్ల టీడీపీ జెండా ప్రదర్శన
రణస్థలం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): టీడీపీ 44వ ఆవిర్భావదినం వేడు కలు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామం వీఎన్ పురంలో నిర్వహించారు. టీడీపీ జెండా ను ఎంపీ ఆవిష్కరించారు. సైకిల్ ర్యాలీ చేపట్టి భద్రమహాకాంళి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జీరుపాలెం సమద్ర తీరంలో 44 మీటర్ల టీడీపీ జెండాను ప్రదర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు పిన్నింటి భానోజి నాయుడు, నేతలు రౌతు శ్రీనివాసరావు, కనకారావు, సుంకరి ధనుంజయ, గొర్లె సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల, మార్చి 29 (ఆం ధ్రజ్యోతి): మండలంలోని అన్ని గ్రామాల్లో టీడీపీ ఆవిర్భావ దినం ఆదివారం నిర్వహించారు. ఎస్‌ఎంపు రంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయ ణమూర్తి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.