Share News

నోయిడా కార్మికులపై నిర్బంధాలు ఆపాలి

ABN , Publish Date - May 13 , 2026 | 12:09 AM

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నోయిడా కార్మికులపై ప్రభుత్వ నిర్బంధ చర్యలు ఆపా లని, కార్మికులందరికీ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వా లని, 8 గంటల పనిదినం అమలు చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

నోయిడా కార్మికులపై నిర్బంధాలు ఆపాలి
అంబేడ్కర్‌ కూడలి వద్ద ఽధర్నా చేస్తున్న అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు

అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులు

అరసవల్లి, మే 12(ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నోయిడా కార్మికులపై ప్రభుత్వ నిర్బంధ చర్యలు ఆపా లని, కార్మికులందరికీ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వా లని, 8 గంటల పనిదినం అమలు చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక అంబేడ్కర్‌ కూడ లి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, పి.తేజేశ్వరరావు, ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, ఇఫ్టూ జిల్లా నాయకురాలు ఎస్‌.కృష్ణవేణి మాట్లాడుతూ.. లేబర్‌ కోడ్లతో కార్మికులు తీవ్రంగా నష్టపోతారన్నారు. పని గంటలను తగ్గించాలని పోరాటం చేస్తుంటే అక్కడి ప్రభుత్వం కేసు లను అక్రమంగా బనాయించి ఉద్యమాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. నోయిడా కార్మి కుల డిమాండ్లను పరిష్కరించకుంటే దేశవాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు అల్లు సత్యనారాయణ, ఎం .గోవర్థనరావు, ఎన్‌.బలరాం, ఎం.రాఘవ, ఎం.నాగేశ్వర రావు, డి.రాము, కేదారేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2026 | 12:09 AM