Share News

కార్గో ఎయిర్‌పోర్టు పేరుతో విధ్వంసం వద్దు

ABN , Publish Date - May 06 , 2026 | 12:14 AM

కార్గో ఎయిర్‌ పోర్టు పేరుతో ఉద్దానం ప్రాంతాన్ని విధ్వంసం చేయవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవింద రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకట రమణ, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు అన్నారు.

కార్గో ఎయిర్‌పోర్టు పేరుతో విధ్వంసం వద్దు
నిరసన దీక్షలో ఐక్యత చాటుతున్న వామపక్ష నేతలు

వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు

అరసవల్లి, మే 5(ఆంధ్రజ్యోతి): కార్గో ఎయిర్‌ పోర్టు పేరుతో ఉద్దానం ప్రాంతాన్ని విధ్వంసం చేయవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవింద రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకట రమణ, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే పార్కు వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. ఉద్దానం తీర ప్రాంతంలో లక్షలాది మొక్కలు, చెట్లు ఉన్నాయని, ప్రకృతి వైపరీ త్యాల నుంచి ఇవి జిల్లాను కాపాడుతున్నా యన్నారు. ఎయిర్‌పోర్టు పేరుతో లక్షలాది జీడి, కొబ్బరి, మునగ చెట్లను నరకడం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని, వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను విరమించు కోవాలని, లేకుంటే ప్రజా ప్రతి ఘటన తప్పదని హెచ్చరించారు. జూన్‌ 6వ తేదీన ‘చలో ఉద్దానం’ చేపట్టి రాంపురంలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహి స్తామన్నారు. కార్యక్రమంలో కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు, రైతు సంఘం ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 12:14 AM