పర్యవేక్షణ లేక.. పరిపాలన సాగక
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:41 PM
పాతపట్నం ఎమ్మార్సీ భవనం నిర్వహణపై పర్యవేక్షణ లేకపోవడంతో పరిపాలనకు అగచాట్లు తప్పడంలేదు. ఈ భవనానికి ఏళ్ల తరబడి మరమ్మ తులకు లేకపోవ డంతో శిథిలావస్థకు చేరింది.
పాతపట్నం, జనవరి1 (ఆంధ్రజ్యోతి):పాతపట్నం ఎమ్మార్సీ భవనం నిర్వహణపై పర్యవేక్షణ లేకపోవడంతో పరిపాలనకు అగచాట్లు తప్పడంలేదు. ఈ భవనానికి ఏళ్ల తరబడి మరమ్మ తులకు లేకపోవ డంతో శిథిలావస్థకు చేరింది. దీంతో భవనం కారిపోతుండడంతో విలువైన రికార్డులు పాడవుతున్నాయి. ఇక్కడి నుంచి మండలంలోని ప్రాథమిక, యూపీ, ఉన్నత పాఠశాలలతోపాటు గురుకులాలు, కేజీబీవీ, ఆదర్శపాఠశాల లకు సంబంధించిన పరిపాలన కార్యకలాపాలు సాగుతున్నా యి. ఎమ్మార్సీ ప్రాంగణంలో మహాత్మాగాంధీ, సర్వేపల్లి రాధా కృష్ణ, జ్యోతిబాపూలే, బుద్ధ విగ్రహాలతోపాటు కార్యాలయం ప్రాంగణం చుట్టూ పచ్చని చెట్లు ఉండడంతో చూపరులకు ఆదర్శ కార్యాలయాన్ని తలపిస్తోంది. అయితే కార్యాలయం లోపలికి అడుగుపెడితే భయానక పరిస్థితి కనిపిస్తోంది. కనీసం మరమ్మతులు లేకపోవడంతో పెచ్చులూడి పోతుం డడంతో చినుకుపడితే కారిపోయి కార్యాలయంలోపల పలు చోట్లగొడుగులు వేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నా యి.కంప్యూటర్ రూము గోతులమయమయ్యింది. దీంతో పాములు లోపలికి చొరబడే అవకాశముందని సిబ్బంది వాపో తున్నారు. ఈ నేపథ్యంలో కంప్యూటర్ రూమును ముందు రూములోకి మార్చారు. ఈ కార్యాలయాన్ని 2002లో రూ.3.5 లక్షల డిపెప్‌నిధులతో నిర్మించారు.రెండున్నర దశాబ్దాలు కావ స్తున్నా పైపైమెరుగులే తప్ప పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవని ఉపాధ్యాయులు వాపోతున్నారు. నిత్యం ఉపాధ్యాయులతో కలకలాడే ఎమ్మార్సీ గదులు గోతు లమయమయ్యాయి.విద్యార్థుల వివిధ పరీక్షసామగ్రి ఏక రూపు దుస్తులతోపాటు పుస్తకాలు నిల్వఉంచే మండల రిసో ర్స్‌కేంద్రంపై ఉన్నతాధికారులు దృష్టిసారించాలని ఉపాధ్యా యులు కోరుతున్నారు.