రహదారి లేక.. రాకపోకలకు అవస్థలు
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:47 PM
వజ్ర పుకొత్తూరులోని పీఎంఏవై-ఎన్టీఆర్ కాలనీలో సమ స్యలు తిష్ఠవేశాయి.ప్రఽధానంగా పక్కా రహదారి లేకపోవడంతో రాకపోకలకు అగచాట్లు తప్పడం లేదు.
వజ్రపుకొత్తూరు, జనవరి 5(ఆంధ్రజ్యోతి): వజ్ర పుకొత్తూరులోని పీఎంఏవై-ఎన్టీఆర్ కాలనీలో సమ స్యలు తిష్ఠవేశాయి.ప్రఽధానంగా పక్కా రహదారి లేకపోవడంతో రాకపోకలకు అగచాట్లు తప్పడం లేదు.వజ్రపుకొత్తూరుకు కూతవేటు దూరంలో ఎన్టీ ఆర్‌కాలనీలో 53మంది వైసీపీప్రభుత్వం హయాం లో ఇళ్ల స్థలాలు అందజేశారు. ఇందులో 12 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా ఏడు ఇళ్లలో ప్రస్తుతం ని వాసముంటున్నారు. కాలనీలో ఇళ్లు నిర్మించినా వైసీపీహయాంలో మౌలికసదుపాయాలు కల్పించ కపోవడంతో ఇక్కడ ఉండేవారికి అవస్థలుతప్పడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్‌సదుపాయం కల్పించడంతో లబ్ది దారులు ఇళ్లు నిర్మించుకొనేందుకు ముందుకొచ్చా రు. ఇక్కడ తాగునీటి సమస్య కూడా వేధి స్తోం దని నివాసముంటున్న పలువురు చెబుతున్నారు. అయితే కాలనీలోకి వెళ్లే మార్గంలో తుప్పలు, డొంకలు పెరగడంతో విషసర్పాలు సంచరిస్తున్నా యి. చీకటిపడిన తర్వాత కాలనీలోపలికి వెళ్లేం దుకు భయాందోళన చెందుతు న్నట్లు పలువురు వాపోతున్నారు. చిన్నపాటి వర్షానికి లోపలికి వెళ్లే మార్గం బురదమయమవుతుండడంతో నివాస ముండే వారంతా ఇబ్బందిపడుతున్నారు. కాగా కాలనీకి రహదారి ఏర్పాటుకోసం ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరైతే కాలనీకి పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మిస్తామని ఎంపీడీవో ఎన్.రమేష్‌నాయుడు తెలిపారు.