Share News

గిరిజనులను కించపరిచే ఉద్దేశం లేదు

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:57 PM

గిరిజనులను కించపర్చే ఉద్దేశం తనకు లేదని, ఇటీవల జరిగిన ఓ పరిణామంలో తాను అన్న మాటలను వెనక్కు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు.

గిరిజనులను కించపరిచే ఉద్దేశం లేదు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌

నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా..

ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

కవిటి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): గిరిజనులను కించపర్చే ఉద్దేశం తనకు లేదని, ఇటీవల జరిగిన ఓ పరిణామంలో తాను అన్న మాటలను వెనక్కు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. రామయ్యపుట్టుగలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 26న గిరిజన నేతలు తన వద్దకు వచ్చి బెంతు ఒరియాలకు ఎస్టీ హోదా కల్పించ వద్దని కోరారన్నారు. జిల్లాలో ఉన్నవారంతా నకిలీ బెంతు ఒరియాలని వారు ప్రస్తావిం చడంతో ఆ సంఘ నేతలతో కలిసి సామరస్య పూర్వకంగా సమస్య ను పరిష్కరించుకోవాలని సూచించానన్నారు. ఈ తరుణంలో ఓవ్యక్తి మా ట్లాడే భాషకు స్పందించి మాట్లాడాను తప్ప ఎవరినీ తక్కువగా చేసే ఉద్దేశం తనకు లేదన్నారు. ఆ వ్యక్తితో మాట్లాడే విషయంతో తప్పు దొర్లిం దని, అందుకు తాను చింతిస్తున్నానన్నారు. తన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని పేర్కొన్నా రు. సామాజిక వర్గాన్ని కించపర్చేలా మాట్లాడ లేదని చెప్పారు. గిరిజనులంతా కలిసి వచ్చి సమస్యను చెప్పే తరుణంలో వారి అభ్యర్థనలను పరి శీలించే విధంగా మాట్లాడానన్నారు. అయితే గిరిజనులతో కలిసి మాట్లాడే క్రమంలో జరిగిన విషయాలను పూర్తిగా చూడకుండా కొన్ని ఎడిట్‌ వీడియోలతో వైసీపీ నేతలు లబ్ధి పొందాలని సోషల్‌ మీడియా ద్వారా గందరగోళం సృష్టించా లనుకోవడం తగదన్నారు. నియోజకవర్గంలో ఉన్న బెంతు ఒరియాలకు మేలు చేయా ల్సింది పోయి మరింత ఇబ్బందికరంగా తయారయ్యేలా వైసీపీ నేతలు మారడం చూస్తుంటే ఆ కుల స్థులపై వారికున్న చిత్తశుద్ధి ఏమిటో అర్ధమౌతుం దన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ మణి చంద్రప్రకాష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాసుదేవ్‌ ప్రదాన్‌, రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ కె.శంకర్‌రెడ్డి, కాళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బి.చిన్నబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు పి.కృష్ణారావు,నేతలు జీకే నాయుడు, ఎస్‌.చంద్రమోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 11:57 PM