Share News

నిధులు మంజూరు కాక.. మరమ్మతు లేక

ABN , Publish Date - Jan 05 , 2026 | 11:51 PM

టెక్కలి జాతీయరహదారి నుంచి అయోధ్యపురం మీదుగా సుఖదేవుపేట వెళ్లే రహదారికి నిధులు మంజూరుకాక పోవడంతో మరమ్మతులకు నోచుకోవ డంలేదు. ఈ రోడ్డు అడుగడుగునా గోతులమయంకావడంతో వాహనచో దకులు, ప్రయాణికులకు అగచాట్లు తప్పడం లేదు.

నిధులు మంజూరు కాక.. మరమ్మతు లేక
రాళ్లుతేలి గోతులమయమైన అయోధ్యపురం రహదారి

టెక్కలి రూరల్‌, జనవరి 5(ఆంధ్రజ్యో తి): టెక్కలి జాతీయరహదారి నుంచి అయోధ్యపురం మీదుగా సుఖదేవుపేట వెళ్లే రహదారికి నిధులు మంజూరుకాక పోవడంతో మరమ్మతులకు నోచుకోవ డంలేదు. ఈ రోడ్డు అడుగడుగునా గోతులమయంకావడంతో వాహనచో దకులు, ప్రయాణికులకు అగచాట్లు తప్పడం లేదు. టెక్కలి జాతీయరహదారి నుంచి కూర్మనాఽథపురం, అయోధ్యపురం, సుఖదేవుపేట, కాట్రాగడ గ్రామాలు వెళ్లే రహదా రిని టీడీపీప్రభుత్వం కాలంలో 25 ఏళ్ల కిందట వేశారు. తర్వాత కనీసం మరమ్మతులులేక పోవడంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. వైసీపీహయాంలో కాలయాపన చేశారే తప్పా మరమ్మతులకు చర్యలు తీసుకోలేదని పలువురు వాహనచోదకులు వాపోతున్నారు.

Updated Date - Jan 05 , 2026 | 11:51 PM