అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వద్దు
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:00 AM
అమెరికా తో స్వేచ్ఛా వాణి జ్య ఒప్పందంపై భారత్ సంత కాలు చేయవద్దని, దీనివల్ల రైతులు తీవ్రం గా నష్టపోతారని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు అన్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు
అరసవల్లి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): అమెరికా తో స్వేచ్ఛా వాణి జ్య ఒప్పందంపై భారత్ సంత కాలు చేయవద్దని, దీనివల్ల రైతులు తీవ్రం గా నష్టపోతారని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు అన్నారు. స్థానిక అంబేడ్కర్ జంక్ష న్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. ఈ ఒప్పందం అమలులోకి వస్తే దేశంలోకి అమెరికా నుంచి చౌక ధరలకే దిగుమతులు జరుగు తాయని, దీనివల్ల దేశంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే మొక్కజొన్న, మామిడి, పత్తి తదితర పంటల ధరలు పడిపోయి రైతులు నష్టపోయారని, వారిని ఆదు కోవాల్సింది పోయి ఇటువంటి ఒప్పందాలపై సంతకాలు చేయడం వల్ల మరింత కుదేలవుతా రన్నారు. దేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే ఈ ఒప్పందాలపై సంతకాలు చేయవద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, కిసాన్ సెల్ అధ్యక్షుడు కోత మధుసూదనరావు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.చంద్రరావు, పోలాకి ప్రసాదరావు, ఉపాధ్య క్షుడు కె.మోహనరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.రమణ తదితరులు పాల్గొన్నారు.