Share News

ఖైదీలపై వివక్ష వద్దు

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:23 AM

District Judicial Officer J.A. Maulana inspection ‘జైలులోని ముద్దాయిలు, ఖైదీలను కుల, లింగ, వైకల్య వివక్షలతో వేరుగా చూడొద్దు. వివక్షతో చూస్తే కఠినచర్యలు తప్పవ’ని జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా హెచ్చరించారు. సోమవారం ఆయన కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి అంపోలులోని జిల్లా జైలును పరిశీలించారు.

ఖైదీలపై వివక్ష వద్దు
జిల్లా జైలును పరిశీలిస్తున్న జిల్లా న్యాయాధికారి జేఏ మౌలానా

జిల్లా న్యాయాధికారి జేఏ మౌలానా

శ్రీకాకుళం లీగల్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ‘జైలులోని ముద్దాయిలు, ఖైదీలను కుల, లింగ, వైకల్య వివక్షలతో వేరుగా చూడొద్దు. వివక్షతో చూస్తే కఠినచర్యలు తప్పవ’ని జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా హెచ్చరించారు. సోమవారం ఆయన కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి అంపోలులోని జిల్లా జైలును పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి.. ఏ సమస్యలు ఉన్నా నేరుగా కానీ లిఖితపూర్వకంగా కానీ సంప్రదించాలని సూచించారు. ముద్దాయిలు, బెయిల్‌ ఖైదీలకు అవసరమైన న్యాయసహాయం అందించడానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. జైలు అధికారులతో మాట్లాడుతూ.. ‘చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుంది. మనుషుల మధ్య ఏ రకమైన వివక్ష ఉన్నా నేరమే. ఖైదీల రికార్డుల్లో ఎక్కడా కుల ప్రస్థావన రాకుండా చూడాలి. ముద్దాయిలకు న్యాయవాదిని నియమించుకోవడానికి తగిన స్తోమత లేకపోతే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామ’ని జిల్లా న్యాయాధికారి తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా, ఏఎస్పీ కేవీ రమణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు డిప్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ గురుమూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు

Updated Date - Jun 30 , 2026 | 12:23 AM