సాయం సమయాల్లో కోర్టులు వద్దు
ABN , Publish Date - Nov 25 , 2026 | 11:38 PM
సాయంత్రం వేళల్లో కోర్టుల నిర్వహణను నిలుపుదల చేయా లని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల నిరసన
ఆమదాలవలస/కోటబొమ్మాళి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): సాయంత్రం వేళల్లో కోర్టుల నిర్వహణను నిలుపుదల చేయా లని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ మేరకు ఆమదాలవలస, కోటబొమ్మాళిల్లో బుధవారం బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కోర్టులు రాత్రి 8 గంటల వరకు పని చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనుక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో ఆమదాలవలస, కోటబొమ్మాళి బార్ అసోసి యేషన్ అధ్యక్షులు కణితి విజయలక్ష్మీభాయ్,లఖినేని శ్రీనివాస్, పలువురు న్యాయ వాదులు పాల్గొన్నారు.