ఎన్‌ఎంఎంఎస్‌కు రెన్యువల్ చేయించాలి: డీఈవో
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:59 PM
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పథకానికి 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఎంపికై ప్రస్తుతం పది, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు స్కాలర్ షిప్ పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవాలని డీఈ వో ఎ.రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పథకానికి 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఎంపికై ప్రస్తుతం పది, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు స్కాలర్ షిప్ పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవాలని డీఈ వో ఎ.రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యామంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ అధికారికి వెబ్‌సైట్ డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.స్కాలర్‌షిప్.జీవోవీ.ఇన్‌లో ఈనెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు సమయంలో అవసరమైన స్టడీ సర్టిఫికెట్, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ మొదటి పేజీ జతపరిచి డీఈవో కార్యాలయానికి జిల్లా నోడల్ అధికారి లాగిన్ ద్వారా దరఖాస్తులు వెరిఫై చేయించు కోవాలన్నారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేయని విద్యార్థులకు స్కాలర్‌షిప్ ప్రయోజనం పొందే అవకాశం ఉండదన్నారు. కాబట్టి అర్హులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈవిషయాన్ని గమనించాలని సూచించారు. మరింత సమాచారం కోసం 75693 63183 నెంబరులో సంప్రదించాలని కోరారు.