కొత్త సందడి
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:38 PM
New year wishes జిల్లావ్యాప్తంగా నూతన సంవత్సర సందడి నెలకొంది. గురువారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడుకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
కేంద్ర, రాష్ట్ర మంత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ
నిమ్మాడ జనసంద్రం
కోటబొమ్మాళి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా నూతన సంవత్సర సందడి నెలకొంది. గురువారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడుకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. మరోవైపు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్, శ్రీకాకుళం, టెక్కలి ఆర్డీవోలు సాయిప్రత్యుష, ఎన్. కృష్ణమూర్తి కూడా కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఎమ్మెల్యేలు గొండు శంకర్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, బెందాళం అశోక్, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు, వజ్జ బాబూరావు తదితరులు ‘న్యూ ఇయర్’ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు మేరకు బొకేలు, శాలువాల స్థానంలో పుస్తకాలు, పెన్నులను కార్యకర్తలు, అభిమానులు కొనుగోలు చేసి పేదల పిల్లలకు పంపిణీ చేశారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, అధికారుల మధ్య కేంద్ర, రాష్ట్ర మంత్రులు కేక్ కట్ చేశారు. జిల్లా ప్రగతికి కృషి చేస్తామని, విద్య, వైద్యం, ఉపాధికి తొలి ప్రాధాన్యం ఇస్తామని వారు తెలిపారు.