పరిశ్రమల అభివృద్ధికి కొత్త రెక్కలు
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:45 AM
భోగాపురం అంతర్జాతీ య విమాశ్ర యంతో ఉత్తరాం ధ్ర పరిశ్రమల అభివృద్ధికి కొత్త రెక్కలు వచ్చాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
రణస్థలం, జూలై 26(ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీ య విమాశ్ర యంతో ఉత్తరాం ధ్ర పరిశ్రమల అభివృద్ధికి కొత్త రెక్కలు వచ్చాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఆదివారం పైడిభీమవరంలో నిర్వహించిన ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాను పారిశ్రామికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు యువత, వ్యావపారవేత్తలు సహకరించాలన్నారు. పైడిభీమవరం, రణస్థలం పారిశ్రామిక పాంతాల అభివృద్ధికి విమానాశ్రయం కీలక మైలురాయి వంటిదన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం శ్రీధర్, అరబిందో, రెడ్డి ల్యాబ్స్, ఆంధ్ర ఆర్గానిక్ ప్రతినిధులు రాజారెడ్డి, జోగారావు, భాస్కరరాజు పాల్గొన్నారు.