కొత్త ట్యాబ్‌లు అందజేయాలి
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:46 PM
: రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న గ్రామీణ వ్యవసాయ సహాయకులపై(వీఏఏ) క్షేత్రస్థాయిలో పనిభారం పెరుగుతోందని సిక్కోలు రైతు సేవా కేంద్రం ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ వ్య వసాయ అనుబంధఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు కె.సుధీర్, ఎస్.తేజశ్విని, విక్కీ, రవి, నవీన్ తెలిపారు.
టెక్కలి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న గ్రామీణ వ్యవసాయ సహాయకులపై(వీఏఏ) క్షేత్రస్థాయిలో పనిభారం పెరుగుతోందని సిక్కోలు రైతు సేవా కేంద్రం ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ వ్య వసాయ అనుబంధఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు కె.సుధీర్, ఎస్.తేజశ్విని, విక్కీ, రవి, నవీన్ తెలిపారు. ఈ-క్రాఫ్ పని ఒత్తిడి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కలిసి వీఏఏల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ-పంట నమోదు చేయడానికి వీఏఏలు, వీఆర్వోలు, విలేజ్ సెక్రటరీలను కూడా భాగస్వామ్యులను చేయాలని, క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉన్న తమకు నెలవారీ మెంటినెన్స్‌కు రెండువేలు చొప్పున్న అలవెన్స్‌లు ఇవ్వాలని కోరారు. రైతుసేవా కేంద్రాల్లో సిబ్బం దికి పంట నమోదు చేయడానికి ఆరేళ్లు కిందట ఇచ్చిన పాత ట్యాబ్‌లు వాడు తున్నామని, ఆ ట్యాబ్‌ల్లోఉన్న అప్పటి సాంకేతికత నేటి విధానాలకు సపోర్ట్ చేయ డం లేదని, దీని దృష్ట్యా కొత్త ట్యాబ్‌లు, మొబైల్,సిమ్‌లు అందజేయాలని కోరారు.