Share News

అక్టోబరు 1 నుంచి అర్హులందరికీ కొత్త పింఛన్లు

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:13 AM

రాష్ట్రంలో అక్టోబరు ఒకటి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు అందించనున్నామని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మె ల్యే కూన రవికుమార్‌ తెలిపారు.

అక్టోబరు 1 నుంచి అర్హులందరికీ కొత్త పింఛన్లు
పాలవలసలో కరపత్రం ఇచ్చి వివరిస్తున్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఎమ్మెల్యే కూన రవికుమార్‌

సరుబుజ్జిలి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అక్టోబరు ఒకటి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు అందించనున్నామని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మె ల్యే కూన రవికుమార్‌ తెలిపారు. పాలవలస గ్రామంలో మంగళవారం ఇంటిం టికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేసి వివరించారు. 2022 నుంచి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వితం తువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాం గులకు కూటమి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ, టీడీపీ నాయకులు కరణం రాజబాబు, పల్లి సురేష్‌, పల్లాడ సురేం ద్ర, మండల తెలుగు యువత అధ్యక్షుడు దవళ సింహాచలం, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఇలా ్లకుల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 12:13 AM