Share News

తొలకరికి ముందు నవధాన్యాలు సాగు చేయాలి

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:07 AM

తొలకరికి ముందు నవ ధాన్యాల సాగు చేపట్టాలని, ఈ దిశగా అధికారులు రైతు లకు అవగాహన కలిగిం చాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి వైవీ మురళీకృష్ణ అన్నారు.

తొలకరికి ముందు నవధాన్యాలు సాగు చేయాలి
శ్రీకాకుళం రూరల్‌: మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయశాఖాధికారి మురళీకృష్ణ

జిల్లా వ్యవసాయశాఖ అధికారి వైవీ మురళీకృష్ణ

శ్రీకాకుళం రూరల్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): తొలకరికి ముందు నవ ధాన్యాల సాగు చేపట్టాలని, ఈ దిశగా అధికారులు రైతు లకు అవగాహన కలిగిం చాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి వైవీ మురళీకృష్ణ అన్నారు. సింగుపురం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌కే, ఏపీసీఎన్‌ఎఫ్‌ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయం పై రెండు రోజుల పాటు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నవ ధాన్యాల సాగువల్ల నేల సారవంతమై ప్రధాన పంటలకు అవసరమైన పోషకాలు లభిస్తాయన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తాయని, పర్యావరణ కాలుష్యం తగ్గు తుందని, రైతులకు ఖర్చులు తగ్గుతాయని వివరించారు. ఈ దిశగా రైతులు అడుగులు వేయాలని సూచిం చారు. రెండు రోజుల పాటు ప్రకృతి వ్యవసాయం, ఆధునిక విధానాలు తదితర అంశాలపై ఏడీఏ రజని, ఏవో నవీన్‌ తదితరులు రైతులకు అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ఏఈవో ఎరుకునాయుడు, ప్రకృతి వ్యవసాయం మాస్టర్‌ ట్రైనర్లు ఎ.కొండలరావు, కె.ఈశ్వరరావు, ఎ.వైభవలక్ష్మి, కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

‘రసాయన అవశేషాలు లేని ఉత్పత్తి చేపట్టాలి’

సోంపేట, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): రసాయన అవశేషాలు లేని ఆహార ఉత్పత్తి అవసరమని, దీనిని రైతులు ఉద్యమంలా చేపట్టాలని రాగోలు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు బి.ఉదయ్‌, ఎం.శ్రీనివాస్‌, జి.శ్రీనివాస్‌ అన్నారు. వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. పంటల పోషకాలు మొక్కలకు నేరుగా అందించకుండా నేల ఆధారంగా అందిస్తున్నామని గుర్తుంచుకొని నేల ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ టి.భవానీశంకరరావు, ఏవో బి.నరసింహమూర్తి, ప్రకృతివ్యవసాయం మండల సమన్వయకర్త ఎస్‌.కుమారి తదితరులు పాల్గొన్నారు.

‘ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి’

బూర్జ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): రైతులు ప్రకృతి వ్యవసా యంపై దృష్టి సారించాలని మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ రామకృష్ణ నాయుడు అన్నారు. పెద్దపేట రైతు సేవా కేంద్రంలో వ్యవ సాయశాఖ రైతు సాధికారిక ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు శుక్రవారం నిర్వహించారు. పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచిం చారు. కార్యక్రమంలో ఏడీఏ రాజగోపాల్‌, ఏవో ఉషారాణి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 12:07 AM