Share News

నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: ఆర్డీవో

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:52 PM

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-1026 (సర్‌) ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్ప వని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయి ప్రత్యూష హెచ్చరించారు.

 నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: ఆర్డీవో
పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో సాయి ప్రత్యూష

అరసవల్లి, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-1026 (సర్‌) ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్ప వని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయి ప్రత్యూష హెచ్చరించారు. నగర పరిధిలో ‘సర్‌’ ప్రక్రియలో తక్కువ పురోగతి ఉన్న 139, 148, 149, 151, 152 పోలింగ్‌ కేంద్రాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారా లను పంపిణీ చేయాలని, శతశాతం డిజిటలై జేషన్‌ జరగాలన్నారు. సర్వే జరుగుతున్న తీరును పరిశీలించి, పలు సూచనలు చేశారు. బూత్‌ స్థాయి అధికారులు ప్రతీ ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్ల జాబితాను సేకరిం చాలన్నారు. ఓటరు జాబితా ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాలని, క్షేత్రస్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. అర్బన్‌ ఏఈఆర్వో జానకి, బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 11:52 PM