Share News

కేంద్ర ప్రభుత్వ తీరు వల్లే నీట్‌ పేపర్‌ లీకేజీ

ABN , Publish Date - May 17 , 2026 | 12:08 AM

నీట్‌ పేపర్‌ లీకేజీ ఘటన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు అన్నారు.

కేంద్ర ప్రభుత్వ తీరు వల్లే నీట్‌ పేపర్‌ లీకేజీ
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు అన్నాజీరావు

డీసీసీ అధ్యక్షుడు అన్నాజీరావు

ఆమదాలవలస, మే 16 (ఆంధ్రజ్యోతి): నీట్‌ పేపర్‌ లీకేజీ ఘటన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు అన్నారు. శని వారం తన స్వగ్రామం కొర్లకోటలో విలేకరుల తో మాట్లాడుతూ.. యువత భవిష్యత్‌తో కేం ద్రం ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు. గత పదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల్లో పేపర్‌ లీకేజ్‌లు సాధారణమై పోయాయని ఆరోపించారు. పరీక్ష వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంద న్నారు. నీట్‌ పేపర్‌ లీకేజీ వల్ల వైద్య విద్య కోసం కష్టపడుతున్న విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.

Updated Date - May 17 , 2026 | 12:08 AM