నైతిక విలువలతో కూడిన బోధన అవసరం: కలెక్టర్
ABN , Publish Date - Jul 18 , 2026 | 11:32 PM
ప్రాథమిక స్థాయి నుంచే నైతిక విలువలతో కూడిన బోధన అవసరమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. డి.మత్స్యలేశం పంచాయతీ కొత్త మత్స్య లేశం ప్రాథమిక పాఠశాలను శనివారం ఆకస్మికం గా సందర్శించారు.
ఎచ్చెర్ల, జూలై 18(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక స్థాయి నుంచే నైతిక విలువలతో కూడిన బోధన అవసరమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. డి.మత్స్యలేశం పంచాయతీ కొత్త మత్స్య లేశం ప్రాథమిక పాఠశాలను శనివారం ఆకస్మికం గా సందర్శించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత అవసర మని, దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాల న్నారు. పరిశుభ్రత పాటించకపోవడం వల్ల వ్యా ధులు ప్రబలే అవ కాశం ఉందన్నారు. చేతుల శుభ్రత విధానాన్ని, ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హెచ్‌ఎం జి.అజయ్ కుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
‘నీటి సమస్యను పరిష్కరించండి’
గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంద ని, తగు చర్యలు తీసుకోవాలని కొత్త మత్స్యలేశం గ్రామ మహిళలు కోరారు. గ్రామానికి వచ్చిన కలెక్టర్‌ను కలిసి సమస్యను విన్నవించారు. స్థానిక పరిశ్రమల సౌజన్యంతో ప్రారంభించిన పనులు పూర్తికాకపోవడంతో తాగునీటి ఎద్దడి ఎదుర్కొం టున్నామని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సమ స్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలె క్టర్ హామీ ఇచ్చారు.