Share News

మధ్యవర్తిత్వంపై అవగాహన అవసరం

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:59 PM

మధ్యవర్తిత్వంపై న్యాయవాదులు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యా యాధికారి కొండబోలు సునీత అన్నారు.

మధ్యవర్తిత్వంపై అవగాహన అవసరం
ఆన్‌లైన్‌ శిక్షణలో పాల్గొన్న జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు, న్యాయవాదులు

జిల్లా న్యాయాధికారి సునీత

న్యాయవాదులకు కేరళ ట్రైనీలతో శిక్షణ

శ్రీకాకుళం లీగల్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వంపై న్యాయవాదులు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యా యాధికారి కొండబోలు సునీత అన్నారు. నేష నల్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ (నల్సా) ఆదేశాల మేరకు జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్‌లో మధ్యవర్తిత్వంపై కేరళ రాష్ట్రం మాస్టర్‌ ట్రైనీలతో ఆన్‌లైన్‌లో శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారం భమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం దేశం కోసం 3.0 పేరుతో నిర్వ హిస్తున్న ఈ శిక్షణ లక్ష్యాలను పూర్తిగా తెలుసు కోవాలన్నారు. ఈ సందర్భంగా కేరళ నుంచి మాస్టర్‌ ట్రైనీ పి.సురేష్‌కుమార్‌ ఆన్‌లైన్‌లో మధ్య వర్తిత్వం వహించే న్యాయ వాదులకు కెపాసిటీ బిల్డింగ్‌, మధ్యవర్తిత్వ పద్ధతులు, రాజీ ప్రా ముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, పలువురు న్యాయ వాదులు పాల్గొన్నారు

కేసుల నుంచి ఉపశమనానికి మార్గం..

పొందూరు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): గొడవ లు, వివాదాల కారణంగా నమోదైన కేసుల నుంచి కక్షిదారులు మధ్యవర్తుల సాయంతో ఉపశమనం పొందాలని జూనియర్‌ సివిల్‌కోర్టు న్యాయాధికారి బి.జ్యోత్స్న అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బుధవారం పొందూరు అంబేడ్కర్‌ కూడలి నుంచి రాపాక కూడలి వరకు మధ్యవర్తిత్వంపై అవగాహనకు వన్‌కే వాక్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కరపత్రాలు పంచిపెట్టి అవగాహన కలిగించారు. కార్యక్రమం లో న్యాయవాదులు, మధ్యవర్తులు కె.రమణ మూర్తి, అశోక్‌కుమార్‌, వైవీ బ్రహ్మం, పి.రామ్మో హన్‌, రాము, సూపరింటెండెంట్‌ స్వర్ణకుమారి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 11:59 PM