Share News

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:12 PM

:ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యం పెంపొందించడంతో పాటు రైతులకు లాభదాయకంగా ఉంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
దేవాదిలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రమణమూర్తి తదితరులు

-ఎమ్మెల్యే బగ్గు రమణమూరి

నరసన్నపేట, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యం పెంపొందించడంతో పాటు రైతులకు లాభదాయకంగా ఉంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం దేవాది గ్రామంలో మాకివలసకు చెందిన జరుగుళ్ల కమల ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్‌ను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం సాగుకు ఊతం ఇస్తుందన్నారు. ఆధునిక వంగడాలతో ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అర్జించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజవర్గ ఇన్‌చార్జి బగ్గు అర్చన, మార్కెట్‌ కమిటీ చైర్మపర్సన్‌ పోగోటి ఉమామహేశ్వరి, పొందర, కురాకుల సంఘ రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర నర్సింహాలు, నాయకులు అడపా చంద్రశేఖర్‌, శిమ్మ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

- జమ్ము గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సాగుపై ఎన్‌ఎస్‌ఎన్‌ విద్యార్థులకు సంబందిత శాఖ రాష్ట్ర రీజనల్‌ అధికారి జి.హేమసుందర్‌ అవగాహన కల్పించారు. కార్యాక్రమంలో పి.గోవిందరెడ్డి, తోట రమణ తదితరులు పాల్గొన్నారు.

కూటమిది ప్రజారంజక పాలన

పోలాకి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుందని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బూత్‌, క్లస్టర్‌, ఇన్‌చార్జిలు, మండల పార్టీ అధ్యక్షుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉత్తమ సేవలందించిన కూటమి నాయకులను సత్కరించి కానుకలు సమర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు సుగుణ, నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాల కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:12 PM