Share News

జాతీయ స్థాయి గుర్తింపు హర్షణీయం

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:32 AM

బాలల స్నేహ పూర్వక గ్రామం కేటగిరీలో బోరవాని పేట జాతీయ స్థాయికి నామినేట్‌ కావడం అభినంద నీయమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. శుక్రవారం గ్రామంలో అధికారు లతో కలిసి పర్యటించి కేంద్ర బృందం పరిశీలనకు అవసరమైన మౌలిక వసతులపై సమీక్షించారు.

జాతీయ స్థాయి గుర్తింపు హర్షణీయం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

ఎమ్మెల్యే శంకర్‌

గార, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): బాలల స్నేహ పూర్వక గ్రామం కేటగిరీలో బోరవాని పేట జాతీయ స్థాయికి నామినేట్‌ కావడం అభినంద నీయమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. శుక్రవారం గ్రామంలో అధికారు లతో కలిసి పర్యటించి కేంద్ర బృందం పరిశీలనకు అవసరమైన మౌలిక వసతులపై సమీక్షించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేం ద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ, భవనాల రంగులు, కిటికీలకు మెస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. గుర్తించిన సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి బోరవానిపేటకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

సమన్వయంతో పనిచేయండి

శ్రీకాకుళం అర్బన్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. శుక్రవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాల యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకూ చేర్చేందుకు డోర్‌ టు డోర్‌ కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ విభాగాల ప్రతిని ధులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలను నేరు గా తెలుసుకొని పరిష్కరించేందుకే ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాల యంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వారి సమస్యలను ఆలకించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 12:32 AM