రొంపివలస ఉన్నత పాఠశాలకు జాతీయస్థాయి గుర్తింపు
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:21 AM
Recognition for Rompivalasa School పాతపట్నం మండలం రొంపివలస జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల.. జెన్‌క్యానో క్లైమేట్ యాక్షన్ లీడర్‌షిప్ ఛాలెంజ్ 2025-26లో జాతీయస్థాయి విజేతగా నిలిచింది.
పాతపట్నం రూరల్, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): పాతపట్నం మండలం రొంపివలస జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల.. జెన్‌క్యానో క్లైమేట్ యాక్షన్ లీడర్‌షిప్ ఛాలెంజ్ 2025-26లో జాతీయస్థాయి విజేతగా నిలిచింది. గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ క్యాంప్, అవార్డుల ప్రధానోత్సవంలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు పి.స్వాతి బెస్ట్ మెంటార్ టీచర్, విద్యార్థిని బి.కావ్యశ్రీ బెస్ట్‌స్టూడెంట్ యాక్షన్ లీడర్ పురస్కారాలను అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల విద్యార్థులు వర్మీకంపోస్ట్, ఇంకుడుగుంతలు, చెత్త విభజన, విద్యుత్ పొదుపు, మొక్కలు నాటడం, జీవ వైవిధ్యంపై అవగాహన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. దీనికిగానూ జాతీయస్థాయి గుర్తింపు రావడంపై ఎంఈవోలు గోవిందరావు, తిరుమలరావు, ప్రధానోపాధ్యాయుడు కుమారస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.