‘శ్రీకాకుళంలో బ్యాడ్మింటన్ జాతీయస్థాయి పోటీలు’
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:30 PM
శ్రీకాకుళంలో త్వరలో బ్యాడ్మింటన్ జాతీయస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (భాయ్) సంయుక్త కార్యదర్శి, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ (ఏపీ బీఏ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి. అంకమ్మ చౌదరి తెలిపారు.
శ్రీకాకుం కల్చరల్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో త్వరలో బ్యాడ్మింటన్ జాతీయస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (భాయ్) సంయుక్త కార్యదర్శి, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ (ఏపీ బీఏ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి. అంకమ్మ చౌదరి తెలిపారు. శ్రీకాకు ళంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీని యర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలను పరిశీలించేందుకు మంగ ళవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో మరో నాలుగు కోర్టులు ఏర్పాటుచేస్తే ఇక్కడ నేషనల్ మీట్ గాని, ర్యాంకింగ్ టోర్నీ నిర్వహించేందుకు అనుమతు లిస్తామన్నారు. రాష్ట్రస్థాయి మీట్‌కు మంచి ఏర్పాట్లు చేశారని కొనియాడారు. రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడ దినదినాభివృద్ధి చెందుతోంద న్నారు. 2026-27 సీజన్‌కు సంబంధించి వివిధ విభాగాల్లో నిర్వహించనున్న ఆలిండియా నేషనల్ బ్యాడ్మింటన్ పోటీల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈనెల 17 నుంచి 23 వరకు ఢిల్లీలో జరుగనున్న సీనియర్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు 17 ఏళ్ల తరువాత మనదేశం ఈ పోటీ లకు ఆతిథ్యం ఇవ్వడం దేశానికే గర్వకారణ మన్నారు. సమావేశంలో జిల్లా సంఘం చీఫ్ పేట్రన్ డా.గూడేన సోమేశ్వరరావు, అధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్, కార్యనిర్వాహక కార్యదర్శి నారా యణశెట్టి వెంకటకిరణ్ కుమార్, సీఈవో సంప తిరావు సూరిబాబు, ఉపాధ్యక్షుడు గురుగుబెల్లి ప్రసాద్, కంచరాన వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.